భారత్‌లో కరోనా సంక్షోభం కారణంగా 15 లక్షల పాఠశాలలు మూతబడినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. ఫలితంగా 24.7 కోట్ల మంది ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులపై ఈ ప్రభావం పడినట్లు నివేదికలో స్పష్టం చేసింది. కరోనా ప్రారంభానికి ముందే 60 లక్షల మంది బాల, బాలికలు పాఠశాలలకు దూరమైనట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్ల స్కూళ్లు ఏడాది పాటు పూర్తిగా మూతపడినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. భారత్‌లో ప్రతి నలుగురు చిన్నారుల్లో కేవలం ఒకరి వద్ద మాత్రమే డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన యూనిసెఫ్... భారత్‌లో ఆన్‌లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని స్పష్టం చేసింది. భారత్‌లో 24 శాతం ఇళ్లలో మాత్రమే అంతర్జాల సౌకర్యం ఉన్నట్లు పేర్కొంది.