మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం 30వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం కొత్తగా 24 వేల 645 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కొత్తగా.. మరో 58 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 25,04,327
- మొత్తం రికవరీలు: 22,34,330
- మొత్తం మరణాలు: 53,457
ముంబయిలో కేసులు..
మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,262 మందికి వైరస్ సోకింది.
- మొత్తం కేసులు: 3,65,937
- మొత్తం మరణాలు: 11,596
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. నిబంధనలు పాటించకపోతే.. ప్రభుత్వం లాక్డౌన్ విధించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన మంగళవారం సమావేశమవ్వనున్నారు.
దిల్లీలో కేసులు..