Gold biscuits under flight seat: కర్ణాటక కెంపెగౌడ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విమానం సీటు కింద దాచిన 24 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.37 కోట్లు ఉంటుందని చెప్పారు.
ఎలా పట్టుకున్నారంటే..?
Gold smuggling in flight: దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E 096 విమానం.. మంగళవారం ఉదయం 10:30 గంటలకు చేరుకుంది. ఆ సమయంలో ప్రయాణికులు అందరూ కిందకు దిగారు. విమానంలో భారీ మొత్తంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో... బెంగళూరు కస్టమ్స్ అధికారులు విమానాన్ని పూర్తిగా గాలించారు. ఓ సీటు కింద బూడిద రంగు టేపులో సీల్ చేసిన రెండు కడ్డీ లాంటి వస్తువులను అధికారులు గుర్తించారు. వాటిని తెరిచి చూడగా.. అందులో 24 బంగారు బిస్కెట్లు కనిపించాయి.