తమిళనాడు, తూత్తుకుడిలో 23 కిలోల అంబర్ గ్రీస్(తిమింగలం వాంతి)పదార్థాన్ని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.23 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
తూత్తుకుడి తీరప్రాంతం నుంచి శ్రీలంకకు గుట్టు చప్పుడు కాకుండా అంబర్ గ్రీస్ను తరలించేందుకు యత్నించింది ఓ స్మగ్లింగ్ మూఠా. వాహన తనిఖీల్లో భాగంగా దీన్ని పోలీసులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న సద్దాం హుస్సెన్, పెరియసామి, ప్రభాకరణ్లను అరెస్ట్ చేశారు. ముగ్గురిని తూత్తుకూడిలోని కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి పెరురాని జైలుకి తరలించారు.