అతి తక్కువ వయస్సులో ప్రాణాంతక కరోనాను జయించింది ఓ నవజాత శిశువు. యూపీలోని గాజియాబాద్‌కు చెందిన ఓ చిన్నారి.. పుట్టిన ఎనిమిది రోజులకే కరోనా బారిన పడింది. దీంతో శిశువును స్థానిక యశోద ఆసుపత్రిలో చేర్చారు. 15 రోజుల చికిత్స అనంతరం ఆ చిన్నారి.. కొవిడ్‌ను జయించినట్లు వైద్యులు తెలిపారు.
కరోనా సోకిన ఆ చిన్నారి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడినట్లు తల్లితండ్రులు తెలిపారు. 15 రోజుల అనంతరం పరీక్షించగా ఆ చిన్నారికి నెగెటివ్ వచ్చింది. ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.