మహారాష్ట్ర రిసోద్ తాలూకాలోని డెగావ్లో 229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా సోకింది. మరో నలుగురు సిబ్బందికి కూడా వైరస్ నిర్ధరణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకొన్న కలెక్టర్ షణ్ముగరాజన్ పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా
మహారాష్ట్రలోని డెగావ్లో 229 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వారంతా హాస్టల్ విద్యార్థులు కావడం గమనార్హం.
229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా
మహమ్మారి సోకిన విద్యార్థులకు మెరుగైన చికిత్స, సరైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. పర్యావేక్షణాధికారిగా అసిస్టెంట్ కలెక్టర్ వైభవ్ వాగ్మారేను నియమించారు.