తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో(Tamil Nadu Local Body Election 2021) ఓ 22 ఏళ్ల యువతి తన సత్తా చాటింది. చిన్న వయసులోనే పంచాయతీ ప్రెసిడెంట్గా(Youngest Panchayat President In India) ఎన్నికైంది.
అక్టోబర్ 6, 9న తమిళనాడులలోని తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు(Tamil Nadu Local Body Election 2021) నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంతో మంది విద్యావంతులైన యువత పోటీ చేశారు. ఈ ఎన్నికల ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. తెంకాసీ జిల్లా(Tamil Nadu Tenkasi News) కడ్యమ్ పంచాయతీ యూనియన్ పరిధిలోని వెంకటంపట్టి పంచాయతి కౌన్సిల్ ప్రెసిడెంట్గా చారుకళ(22) ఎన్నికైంది.
మాస్టర్స్ చేస్తూ..
లక్ష్మీయూర్ గ్రామానికి చెందిన రవి సుబ్రమణ్యం, శాంతి దంపతుల కుమార్తె చారుకళ. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె.. ప్రస్తుతం మాస్టర్స్ చేస్తొంది. తన తండ్రి సలహాతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. తాళం చెవి గుర్తుతో ఎన్నికల్లో నిల్చున్న ఆమె... తమ పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తద్వారా ఎన్నికల ఫలితాల్లో మంచి మెజార్టీతో గెలుపొందింది. చిన్నవయసులోనే ప్రెసిడెంట్ పదవికి ఎంపికై.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలించింది.