తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఐఐటీ గువాహటి పరిశోధకులు

ఐఐటీ గువాహటికి చెందిన 22 మంది పరిశోధకులకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ పరిశోధకుల జాబితాలో వీరు స్థానం సంపాదించారు.

IIT_GUWAHATI
'అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో..22మంది ఐఐటీ గువాహటి పరిశోధకులే'

By

Published : Nov 7, 2020, 9:03 AM IST

ప్రపంచంలోని అత్యుత్తమ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో గువాహటి ఐఐటీకి చెందిన 22 మంది పరిశోధకులు, ప్రావీణ్యులకు చోటు దక్కింది. అమెరికాలోని స్టాన్​ఫోర్డ్ విశ్వవిద్యాలయ నిపుణులు సిద్ధం చేసిన ఈ నివేదికలో వీరికి అరుదైన గౌరవం లభించింది.

తమ పరిశోధనలతో.. ఆయా రంగాల్లో పురోగతిని సాధించి, ఇతర పరిశోధనలకు దోహదపడిన లక్ష మందికి పైగా శాస్త్రవేత్తలను జాబితాలో చేరుస్తూ ఈ నివేదికను తయారు చేశారు. తమ శాస్తవేత్తలు సాధించిన ఘనతపై ఐఐటీ సంచాలకులు, ఫ్రొఫెసర్ టి.జి. సీతారాం హర్షం వ్యక్తం చేశారు. 22 మందికి ఈ జాబితాలో చోటుదక్కడం ఐఐటీకి గర్వకారణమని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:వనరులతోనే విద్యావికాసం.. నూతన విధానంలో అదే కీలకం

ABOUT THE AUTHOR

...view details