తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ నాలుగో దశలో 22% అభ్యర్థులు నేరచరితులే.. - అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ నివేదిక

బంగాల్​ శాసనసభకు జరగనున్న నాలుగో దశ ఎన్నికల్లో.. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 22శాతం మంది నేరచరిత్రను కలిగి ఉన్నట్లు 'అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రీఫామ్స్​​' నివేదిక స్పష్టం చేసింది. వీరంతా క్రిమినల్​ కేసులు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ADR report
బంగాల్ నాలుగో దశలో 22% అభ్యర్థులు నేరచరితులే..

By

Published : Apr 3, 2021, 10:50 PM IST

బంగాల్​ శాసనసభ నాలుగో దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరిత్ర వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నాలుగో దశలో పోటీ చేస్తున్న 22 శాతం మందిపై నేరచరిత్ర ఉన్నట్లు స్పష్టం చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి ఓ నివేదికను సమర్పించింది.

ఈ నివేదిక వివరాలు..

  • 81(22శాతం) మంది అభ్యర్థులు తమపై క్రిమినల్​ కేసులున్నట్లు తెలిపారు.
  • 65(17శాతం) మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
  • 65(17శాతం) అభ్యర్థులు కోటీశ్వరులమని పేర్కొన్నారు.
  • 19 మంది అభ్యర్థులు తమపై.. మహిళపై నేరారోపణలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు. నలుగురు అభ్యర్థులు తమపై అత్యాచార కేసులున్నట్లు తెలిపారు.
  • 16 మంది అభ్యర్థులు తమపై హత్యాయత్నం కేసులున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'పూరీ' ఆలయంలో ప్రతి ఆదివారం దర్శనాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details