Farm bodies political front: పంజాబ్లో 22 రైతులు సంఘాలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. అన్నీ ఏకమై కొత్త రాజకీయ వేదిక 'సంయుక్త సమాజ్ మోర్చా'ను స్థాపించాయి. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు రైతు సంఘం నేత హర్మీత్ సింగ్ కదియాన్ వెల్లడించారు.
ఈ సంఘాలన్నీ దిల్లీ సరిహద్దులో జరిగిన రైతు నిరసనల్లో పాల్గొన్నాయి. అయితే నిరసనల్లో మొత్తం 32 రైతుల సంఘాలు పాల్గొనగా 22 రైతుల సంఘాల మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ మోర్చాకు ప్రజలు మద్దతు ఇవ్వాలని రైతు సంఘం నాయకుడు బల్బీర్ సింగ్ రాజెవాల్ విజ్ఞప్తి చేశారు.