బంగాల్ (West Bengal Crime) కేంద్రంగా విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు అక్కడి పోలీసులు. అమెజాన్ సంస్థకు చెందిన ఉద్యోగులమని చెప్పుకుంటా.. అలిపోరే ప్రాంతంలో నకిలీ కాల్ సెంటర్‌ను(Fake Call Center) నడుపుతున్న 22 మందిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో కోల్‌కతా పోలీసు- గూండా వ్యతిరేక విభాగం.. మంగళవారం రాత్రి అలిపోరేలోని బంకిమ్ ముఖర్జీ సరనీ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, ఈ ముఠాను పట్టుకుంది.
"నిందితులు సరైన పత్రాలు లేకుండానే కాల్‌సెంటర్‌ను నడుపుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా, తమను తాము అమెజాన్ సంస్థ ఉద్యోగులమని చెప్పుకుంటూ బాధితులకు నిందితులు ఫోన్ చేసేవారని తేలింది. తమకు అమెజాన్ నుంచి బహుమతి వచ్చిందని, అందుకు డబ్బులు చెల్లిస్తే, రీఫండ్ చేస్తామని చెప్పి మోసగించేవారు."
- పోలీసులు