తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకూ నిర్వహించిన దాడుల్లో మొత్తం రూ.217.35 కోట్లు విలువ చేసే నగదు, వస్తువులు సీజ్ చేసినట్లు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సగు తెలిపారు.
ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో భారీగా నగదు సీజ్ - తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
తమిళనాడు ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆ రాష్ట్రంలో వివిధ చోట్ల నిర్వహించిన తనిఖీల్లో రూ.217.35 కోట్లు విలువ చేసే నగదు, వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో రూ.217కోట్ల నగదు సీజ్
వీటిలో..
- రూ.80.88 కోట్ల నగదు.
- 404 కిలోల బంగారం(రూ.117కోట్లు).
- 299 కిలోల వెండి(రూ.1.65కోట్లు).
- 1,18,524.37 లీటర్ల మద్యం(రూ.1.61కోట్లు ) పట్టుబడినట్లు ఎన్నికల అధికారి వివరించారు.
ఇదీ చదవండి:ఓటర్లకు డబ్బులు పంచిన అన్నాడీఎంకే నేత