దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 21,257 మందికి కొవిడ్(Coronavirus update) సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 271 మంది మృతి చెందారు. ఒక్కరోజే 24,963 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 205 రోజుల కనిష్ఠానికి చేరింది.
- మొత్తం కేసులు: 3,39,15,569
- మొత్తం మరణాలు: 4,50,127
- మొత్తం కోలుకున్నవారు: 3,32,25,221
- యాక్టివ్ కేసులు: 2,40,221
పరీక్షలు
గురువారం ఒక్కరోజే 13,85,706 కొవిడ్ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58,00,43,190 కు చేరింది.
వ్యాక్సినేషన్..
అక్టోబరు 7న... 50,17,753 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 93,17,17,191కి చేరినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,61,091 మందికి కరోనా (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 7,902 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,75,50,924 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,49,411కి పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా- 1,02,090
- బ్రిటన్- 40,701
- టర్కీ- 30,019
- రష్యా- 27,550
- బ్రెజిల్- 15,044
- ఇరాన్- 11,625
- జర్మనీ -22,403
ఇదీ చూడండి:కిడ్నాపర్ల పనిబట్టేందుకు కానిస్టేబుల్ సాహసం.. కారుపైకి దూకి...