తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 211 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పొడి చేసి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాల్లో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ఇండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తున్న సమయంలో ఈ బంగారం లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికుడి చెక్-ఇన్ బ్యాగేజీలో కూడా 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా లభించాయని వెల్లడించారు. మొత్తం బంగారం విలువ రూ.21.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. చాక్లెట్ పౌడర్‌లో కలిపి డబ్బాల్లో తరలిస్తూ.. - చాక్లెట్ పౌడర్‌లో కలిపి దాచిన బంగారం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 20 తులాల బంగారాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బంగారాన్ని పొడి చేసి చాక్లెట్ పౌడర్ డబ్బాలో కలిపి తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

విమానాశ్రయంలో రూ.70 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత..
తమిళనాడులో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి బ్యాగ్.. బ్యాక్‌ప్యాక్‌లో రూ.70 లక్షల విలువైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు.
3.54 కిలోల బంగారం పట్టివేత..
అదే రాష్ట్రంలో కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం షార్జా నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికుల వద్ద 3.54 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.05 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడతున్నట్లు అధికారులు చెప్పారు.