తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బాలో చిన్నారిని పెట్టి.. నదిలో వదిలేసి... - గాజీపుర్ న్యూస్ టుడే

సూర్యభగవానుడి నుంచి ఓ పుత్రుడిని వరంలా పొందింది కుంతీ మాత. తర్వాత ఏం చేయాలో తెలియక ఆ పుత్రుడిని డబ్బాలో వేసి నీటిలో వదిలేస్తుంది. ఈ కథ మనం భారతంలో విన్నాం. ఇలాంటి ఘటనే ఉత్తర్​ప్రదేశ్​ గాజీపుర్​లో జరిగింది.

ghazipur, baby
పసికందు, చిన్నారి

By

Published : Jun 16, 2021, 10:45 AM IST

డబ్బాలో చిన్నారిని వదిలేసి..

అభం శుభం తెలియని ఓ పసికందును డబ్బాలో పెట్టి గంగా నదిలో వదిలారు ఆమె తల్లిదండ్రులు. చిన్నారి జాతకం సహా పలు వివరాలు ఓ కాగితంపై రాసి చెక్క డబ్బాలో వదిలేశారు. చివరకు ఆ చిన్నారి ఓ బోటు యజమానికి దొరికింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గాజీపుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

గంగా నది దాద్రీ ఘాట్​ సమీపంలో నీటిపై తేలుతున్న డబ్బాలో చిన్నారి ఏడుపు వినిపించింది. అటుగా వెళ్తున్న బోటు యజమాని మల్లాహ్ గుల్లు.. ఆ డబ్బా తెరిచి చూశారు. 21 రోజుల పసికందు ఏడుస్తూ కనిపించింది.

డబ్బాలో చిన్నారి

వెంటనే చిన్నారిని డబ్బాలో నుంచి బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. చిన్నారికి స్నానం చేయించి ఆహారం అందించారు. డబ్బాలో దుర్గామాత, విష్ణుమూర్తి ఫొటోలు ఉన్నట్లు గుల్లు తెలిపారు.

చిన్నారి జాతకం, పలు వివరాలు

మేమే తల్లిదండ్రులం..

సోమవారం తామే చిన్నారి తల్లిదండ్రులమంటూ.. ఓ జంట తమ ఇంటివద్దకు వచ్చినట్లు గుల్లు తెలిపారు. అయితే.. చిన్నారి తమకు గంగా మాత ప్రసాదించిన బహుమతిలాంటిదని గుల్లు అంటున్నారు. ఆ చిన్నారిని తామే పెంచుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

ఈ విషయంపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు. వారంలో ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. చిన్నారి అసలు తల్లిదండ్రులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:తల్లితండ్రులు మృతి- చిన్నారికి అన్నీ తానైన అక్క

ABOUT THE AUTHOR

...view details