బంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు 2093 మంది మహిళా న్యాయవాదుల. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు లేఖపై సంతకాలు చేశారు.
బంగాల్ హింసలో చిన్నారులు, మహిళలు, దళితులపై దాడి జరిగిందని లేఖలో పేర్కొన్న న్యాయవాదులు.. ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించాలని కోరారు. కోర్టు పర్యవేక్షణలో కాలపరిమితితో దర్యాప్తు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బాధితులు తిరిగే వచ్చేలా ఆ రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాలని విన్నవించారు.