Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - 2023 January 8th to 14th horoscope
Weekly Horoscope: జనవరి 8 - 14 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ఈ వారం రాశి ఫలం
By
Published : Jan 8, 2023, 6:34 AM IST
Weekly Horoscope: జనవరి 8 - 14 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
కాలం వ్యతిరేకంగా ఉంది. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మనోబలంతో పనులు పూర్తిచేయండి. వారం మధ్యలో ఒక సమస్య తొలగుతుంది. ధర్మమార్గంలో శాంతి లభిస్తుంది. ఆర్థికనష్టం సూచితం. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. కుటుంబసభ్యుల సలహాలు పనిచేస్తాయి. సౌమ్యంగా మాట్లాడాలి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.
అభీష్టసిద్ధి కలుగుతుంది. అద్భుతమైన విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదవీయోగం సూచితం. అవస రాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రమించాలి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజ్ఞానవంతులవుతారు. కుటుంబపరంగా ఆనందించే అంశాలున్నాయి. వ్యాపారం కలిసివస్తుంది. సూర్యస్తుతి మేలు.
ధనలాభం ఉంది. లక్ష్యం నెరవేరాలంటే విపరీతమైన కృషి అవసరం. తెలివితేటలతో విఘ్నాలను అధిగమించాలి. సమయం, సందర్భం- రెంటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. దృఢసంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ధర్మమార్గం వీడవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది.
శుభకాలం నడుస్తోంది. పలుమార్గాల్లో విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. తొందర పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశముంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించే కాలమిది. గృహవాహనాది యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదర్శనం ఉత్తమం.
విశేషమైన శుభాలున్నాయి. ఓర్పుతో ఉపయోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహముంటుంది. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల్లో ఆలస్యం గోచరిస్తోంది. బాధ్యతల నిర్వ హణలో ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. నవగ్రహధ్యానం శుభాన్నిస్తుంది.
వ్యాపారం అనుకూలం. స్థిరబుద్ధితో పని చేస్తే విశేషశుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించాలి. కుటుంబసభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గరివారితో విభేదాలు రానీయవద్దు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఆదిత్య హృదయం చదవండి, ఆనందించే అంశముంటుంది.
ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. కాలం ఆనందంగా గడుస్తుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. ఆపద తొలగుతుంది. వివాదాలకు ఆస్కారముంది. సౌమ్య సంభాషణ మేలు. ఇంట్లోవారి సూచనలతో ధర్మమార్గంలో ముందుకెళ్లాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిస్మరణ శక్తినిస్తుంది.
శ్రేష్ఠమైన సమయం. అన్నివిధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార లాభం సూచితం. అపోహలు తొలగుతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో కలిసివస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది శుభయోగాలున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సూర్యధ్యానం శుభప్రదం.
ఉద్యోగంలో శుభ ఫలితముంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. అభీష్టసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ప్రతి పనీ లోతుగా ఆలోచించి చేయండి. ఆపదలున్నాయి, బుద్ధిబలంతో అధిగమించాలి. సమష్టి కృషి ఫలిస్తుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. నవగ్రహశ్లోకాలు పఠించండి, మనోబలం లభిస్తుంది.
ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రమను బట్టి ఫలితముంటుంది కాబట్టి బాగా కృషిచేయాలి. ఉద్యోగం అనుకూలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా స్పందించవద్దు. బాధ్యతలను పూర్తిచేయండి. వ్యాపారంలో ఎవర్నీ నమ్మవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, శాంతి పెరుగుతుంది.
అద్భుతమైన శుభయోగముంది. తగిన మానవప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టండి. బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు తొలగుతాయి. మీవల్ల సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన లాభముంటుంది. స్వయంకృషితో లక్ష్యాన్ని చేరండి. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.
కోరికలు నెరవేరతాయి. మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. కాలం సహకరిస్తోంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. భూ గృహాది యోగాలు సిద్ధిస్తాయి. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది.