Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - 2023 January 15 to 21 Horoscope
Weekly Horoscope: జనవరి 15 - 21 వరకు మీ రాశిఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
2023 జనవరి 15 నుంచి 21 వరకు రాశీఫలాలు
By
Published : Jan 15, 2023, 6:31 AM IST
Weekly Horoscope: జనవరి 15 - 21 వరకు మీ రాశిఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ముఖ్యకార్యాల్లో మంచి విజయముంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. మీరు నమ్మిన సిద్ధాంతంతోనే కృషిచేయండి. నిర్ణయాలను మార్చవద్దు. ఇంట్లోవారితో సంప్రదించి పనులు మొదలుపెట్టండి. ఖర్చులు తగ్గించాలి. రుణసమస్యలు పెరగనివ్వద్దు. అపార్థాలకు తావివ్వకూడదు. ఈర్ష్యపడేవారున్నారు. నవగ్రహశ్లోకాలు పఠించండి, మనఃశ్శాంతి లభిస్తుంది.
మనోబలంతో పని మొదలుపెట్టండి. తిరుగు లేని ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాన్ని గతానుభవంతో పరిష్కరించుకోవాలి. చంచలత్వం రానివ్వద్దు. సమదృష్టీ మిత్రభావనా శాంతినిస్తాయి. పనులను సకాలంలో పూర్తిచేయాలి. సత్కార్యాలపై దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. సూర్యస్తోత్రం పఠించండి, ఆనందించే అంశాలుంటాయి.
ఆదాయమార్గాలు పెరుగుతాయి. నిరంతరం శ్రమిస్తూ ఉత్తమ కార్యాచరణను రూపొందించాలి. నిర్ణయాలను సకాలంలో అమలుచేయాలి. ధనలాభం ఉంది. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాటు జరగనివ్వద్దు. దృఢసంకల్పంతో పని చేయండి. లక్ష్యం చేరువలోనే ఉంది. వారాంతంలో మేలు జరుగుతుంది. శివారాధన ఉత్తమం.
అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఉద్యోగంలో శ్రేష్ఠమైన ఫలితం పొందుతారు. అధికారలాభం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. అవరోధాలు తొలగుతాయి. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. యోగ్యతలు పెంచుకుంటూ ముందుకెళ్లాలి. సూర్య అష్టోత్తరం చదివితే మేలు.
మనోబలంతో విజయం సాధిస్తారు. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయండి. విఘ్నాలున్నా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యాన్ని చేరాలి. ధర్మబద్ధంగా కృషిచేయాలి. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నాన్ని కొనసాగించాలి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. విశ్రాంతి అవసరం. విష్ణు సహస్రనామం చదువుకుంటే మంచిది.
వ్యాపారయోగం అద్భుతంగా ఉంది. ఆర్థిక వృద్ధి సూచితం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. కొందరివల్ల శ్రమ పెరుగుతుంది. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మానసిక దృఢత్వం అవసరం. గందరగోళానికి లోనవ్వద్దు. సమష్టి కృషి మంచి భవిష్యత్తునిస్తుంది. నిలకడగా ఉండాలి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేష్ఠం.
మిశ్రమ కాలం నడుస్తోంది. దైవబలం కొంతవరకు సహకరిస్తుంది. మానవప్రయత్నం ఎక్కువగా ఉండాలి. తడబాటు లేకుండా నిర్ణయం తీసుకోండి. సంకల్పబలంతో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో జాగ్రత్త. పనిలో స్పష్టత అవసరం. మాటలో నిజాయతీ ఉండాలి. వ్యాపారలాభం సూచితం. దేనికీ బద్ధకించవద్దు. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.
శుభకాలం నడుస్తోంది. ఉత్తమ కార్యాచరణ చేపట్టండి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. వర్తమానంలో చేసే పనులు లాభాన్నిస్తాయి. కుటుంబపరంగా మేలు జరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది.
శుభయోగముంది. సకాలంలో పనులు ప్రారంభించండి. అనుకున్న ఫలితం వస్తుంది. బాధ్యతలను ఓర్పుగా నిర్వర్తించాలి. సంశయించకుండా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. వివాదాల జోలికి పోవద్దు. మిత్రులవల్ల మంచి జరుగుతుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సూర్యారాధన మేలు.
శుభ ఫలితాలుంటాయి. పనులు సకాలంలో పూర్తిచేయాలి. విఘ్నాలను తప్పించుకోవాలి. ఇతరుల గురించి అతిగా స్పందించవద్దు. ఉద్యోగం బాగుంటుంది. చంచల నిర్ణయాలతో సమస్యలు తెచ్చుకోవద్దు. వారం మధ్యలో గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. సూర్యనారాయణమూర్తిని స్మరించండి, మంచివార్త వింటారు.
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష కృషి చేసి లాభం పొందుతారు. లక్ష్యాన్ని త్వరగా చేరతారు. కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించండి. ఉద్యోగంలో నిబద్ధత అవసరం. పెద్దల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంతచిత్తంతో పనిచేయాలి. శత్రుశేషం ఇబ్బందిపెడుతుంది. మిత్రుల సలహా తీసుకోవాలి. సమష్టి నిర్ణయం మేలు చేస్తుంది. ఆదిత్య స్తుతి శక్తినిస్తుంది.
ఉద్యోగం సంతృప్తిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్నిస్తుంది. అధికారలాభం సూచితం. ఓర్పుతో పనులు పూర్తిచేయండి. ఆశయాలు సిద్ధిస్తాయి. మంచితనం రక్షిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్తు పొందుతారు. ఆర్థికవృద్ధి సూచితం. దగ్గరివారితో ఆనందాన్ని పంచుకుంటారు. శాంతి లభిస్తుంది. విష్ణు ఆరాధన ఉత్తమం.