తెలంగాణ

telangana

సెమీస్​ విజేత 'బీజేపీ'నే- నాలుగు రాష్ట్రాల ఫైనల్​ రిజల్ట్స్​ ఇవే

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 10:27 PM IST

Updated : Dec 3, 2023, 10:37 PM IST

2023 Election Results : ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అదరగొట్టింది. సెమీఫైనల్ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది.

2023 election results
2023 election results

2023 Election Results :2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావించే ఈ ఎన్నికల్లో బీజేపీ అదరగొట్టింది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. ఒక్క తెలంగాణలో మాత్రం కాంగ్రెస్​ పార్టీ విజయాన్ని కైవసం చేసుకుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమగ్ర కథనం మీ కోసం.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018
మధ్యప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు 2023
మధ్యప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు 2023
మధ్యప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు 2018
ఛత్తీస్​గఢ్​​ ఎన్నికల ఫలితాలు 2023
ఛత్తీస్​గఢ్​​ ఎన్నికల ఫలితాలు 2023
ఛత్తీస్​గఢ్​​ ఎన్నికల ఫలితాలు 2018
రాజస్థాన్​ ఎన్నికల ఫలితాలు 2023
రాజస్థాన్​ ఎన్నికల ఫలితాలు 2023
రాజస్థాన్​ ఎన్నికల ఫలితాలు 2018

మధ్యప్రదేశ్​లో తిరుగులేని బీజేపీ
Madhya Pradesh Election Results 2023 in Telugu : మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మరోసారి బంపర్‌ మెజార్టీతో విజయ దుందుభి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు మించి భారీ మెజార్టీ సాధించింది. మొత్తం 230నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్​ 66 సీట్లు గెలవగా, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 18ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాషాయపార్టీ మూడింట రెండొంతులకుపైగా విజయం దిశగా దూసుకెళ్లింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. బుధ్నీలో విజయం సాధించారు. ఆయన తన సమీపప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన విగ్రమ్‌మస్తాల్‌పై గెలుపొందారు. భారతీయ జనతా పార్టీ ముగ్గురు కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌సహా ఏడుగురు ఎంపీలను బరిలో దించింది. మోదీ ఛరీష్మా, ఆయన ఇచ్చిన గ్యారంటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనులు కమలం పార్టీని విజయానికి చేరువచేశాయి

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తలకిందులు చేస్తూ
Chhattisgarh Election Results 2023in Telugu :ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో 46 శాతానికిపైగా ఓట్లను దక్కించుకుంది. సీఎం భూపేశ్‌ బఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఓటర్లు మాత్రం కాషాయ పార్టీకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 54 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ 35 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పాలనకు 2018లో తెరదించి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా ఈసారి మళ్లీ బీజేపీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంది. 2000 నుంచి జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయిలో భాజపాకు ఓట్లు రావడం ఇదే మొదటిసారి. బీజేపీ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

రాజస్థాన్​లోనూ కమల వికాసం
Rajasthan Election Result 2023 in Telugu : రాజస్థాన్‌లో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 199 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 114 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్‌ ఓటర్లు జై కొట్టిన వేళ, అధికార కాంగ్రెస్‌ పార్టీ కేవలం 71 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు 14 స్థానాల్లో విజయం సాధించారు. కమల పార్డీ వికాసంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

తెలంగాణలో హస్తం జోరు
Telangana Election Results 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది.ఆరు గ్యారెంటీలు, మార్పు నినాదంతో బరిలోకి దిగిన హస్తం పార్టీ, మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధిద్దామని భావించిన గులాబీదళం ఆశలపై నీళ్లు చల్లింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాలు సాధించింది. భారాస 39 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2018లో కేవలం ఒక్క చోటే గెలిచిన బీజేపీ ఈసారి 8 స్థానాల్లో విజయం సాధించింది. మజ్లిస్ పార్టీ పాతబస్తీలో తనకు పట్టుకున్న 7 స్థానాలను కైవసం చేసుకుంది.

సెమీఫైనల్స్​లో బీజేపీ సూపర్​ షో- విజయానికి ప్రధాన కారణాలివే!

12 రాష్ట్రాల్లో బీజేపీ- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్​- పొలిటికల్ మ్యాప్​ను మార్చేసిన సెమీఫైనల్!

'ప్రజల మదిలో మోదీ'- చెక్కుచెదరని 'హిందుత్వ' పవర్! 2024లో బీజేపీని అడ్డుకునే 'శక్తి' ఉందా?

Last Updated : Dec 3, 2023, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details