తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం వారిదే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవే

ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం ఎవరిదో తేలిపోయింది. ఎగ్జిట్​పోల్స్ తమ అంచనాలు వెలువరించాయి.

2023 assembly election tripura nagaland meghalaya exit polls
2023 assembly election tripura nagaland meghalaya exit polls

By

Published : Feb 27, 2023, 8:05 PM IST

Updated : Feb 27, 2023, 9:35 PM IST

ఈశాన్య రాష్ట్రాల్లో అధికారం ఎవరిదన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింట్లో బీజేపీ కూటమిదే హవా అని స్పష్టం చేశాయి. త్రిపురలో కమలం పార్టీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి 36 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే ఎగ్జిట్​పోల్ స్పష్టం చేసింది. వామపక్ష-కాంగ్రెస్ కూటమి గరిష్ఠంగా 11 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. తిప్రా మోథా పార్టీ 9 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని వెల్లడించింది.

  • జీ న్యూస్ మ్యాట్రిజ్
    • భాజపా కూటమి: 29-36
    • వామపక్ష కూటమి: 13-21
    • తిప్రా మోథా పార్టీ: 11-16
  • టైమ్స్‌ నౌ ఈటీజీ రీసెర్చ్‌
    • భాజపా కూటమి: 21-27
    • వామపక్ష కూటమి: 18-24
    • తిప్రా మోథా పార్టీ:

నాగాలో బీజేపీ పాగా!
నాగాలాండ్​లో బీజేపీ-ఎన్​డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ కూటమి 38 నుంచి 48 సీట్లు గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పోల్ తెలిపింది. కాంగ్రెస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. ఎన్​పీఎఫ్ 3-8, ఇతరులు 5-15 స్థానాల్లో గెలవొచ్చని అంచనా వేసింది.

  • జీ న్యూస్ మ్యాట్రిజ్
    • భాజపా-ఎన్డీపీపీ కూటమి: 35-43
    • కాంగ్రెస్: 1-3
    • ఎన్‌పీఎఫ్‌: 2-5
    • ఇతరులు: 6-12
  • టైమ్స్‌ నౌ ఈటీజీ రీసెర్చ్‌
    • భాజపా-ఎన్డీపీపీ కూటమి: 39-49
    • కాంగ్రెస్:
    • ఎన్‌పీఎఫ్‌: 4-8

మేఘాలయలో ఎన్​పీపీ
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ) అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు జీ న్యూస్ మ్యాట్రిజ్ సర్వే వెల్లడించింది. ఎన్​పీపీ 21 నుంచి 26 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. భాజపా 6 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 6 సీట్లు గెలవొచ్చని పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ 8-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని జీ న్యూస్ మ్యాట్రిజ్ పేర్కొంది. 10 నుంచి 19 స్థానాల్లో ఇతరులు గెలుస్తారని తెలిపింది.

  • జీ న్యూస్ మ్యాట్రిజ్
    • నేషనల్ పీపుల్స్ పార్టీ: 21-26
    • భాజపా: 6-11
    • కాంగ్రెస్: 3-6
    • తృణముల్ కాంగ్రెస్: 8-13
    • ఇతరులు: 10-19
  • టైమ్స్‌ నౌ ఈటీజీ రీసెర్చ్‌
    • నేషనల్ పీపుల్స్ పార్టీ: 18-26
    • భాజపా: 3-6
    • కాంగ్రెస్: 2-5
    • తృణముల్ కాంగ్రెస్: 8-14

త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరిగాయి. రికార్డు స్థాయిలో 88 శాతం ఓటింగ్ నమోదైంది. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు సోమవారమే ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​కు అనుమతించారు. అయితే, రాత్రి 7 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదని ఎన్నికల సంఘం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. త్రిపుర అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో 259 మంది బరిలో ఉన్నారు. ఎన్నికల్లో భాజపా-ఐపీఎఫ్‌టీతో కలిసి పోటీ చేస్తుండగా... సీపీఎం-కాంగ్రెస్‌ సంయుక్తంగా బరిలో నిలిచాయి. ప్రద్యోత్ విక్రమ్ మానిక్య దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోథా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో తలపడుతోంది.

నాగాలాండ్​లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 59 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. అధికార నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ- బీజేపీ కూటమి మరోసారి కలిసి పోటీ చేశాయి. 40:20 నిష్పత్తిలో సీట్లు పంచుకున్నాయి. ఎలాగైనా మరోసారి అసెంబ్లీలో మెజార్టీ సాధించాలని ఈ కూటమి భావిస్తోంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ 21 సీట్లలో బరిలో ఉంది. 19 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.
మేఘాలయలో 59 స్థానాలకు 369 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 36 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అధికార కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ, భాజపా వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం బరిలో ఉన్నాయి.

Last Updated : Feb 27, 2023, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details