పాకిస్థాన్.... 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భద్రతా అధికారులు వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు 18ఏళ్లల్లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.
"ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడింది. 2020లో 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంటే రోజుకు సగటున 14 కేసులు. ఈ ఘటనల్లో 36మంది మరణించారు. వీరిలో 24మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 130మందికిపైగా గాయపడ్డారు."
--- భద్రతా అధికారులు.
2019లో ఈ సంఖ్య 3,289 అని అధికారులు వెల్లడించారు. వీటిల్లో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగాయని పేర్కొంన్నారు. 2018లో మొత్తం 2,936సార్లు పాక్ సైన్యం దుశ్చర్యలకు పాల్పడిందని వివరించారు.