2015 యూపీఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో(upsc result) అక్క మొదటి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. అక్క నుంచి స్ఫూర్తి పొందిన చెల్లి.. అదే బాటలో నడిచింది. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో(upsc result 2021) 15వ ర్యాంకును సొంతం చేసుకుని.. అక్కకు తగ్గ చెల్లెలు(tina dabi sister) అనిపించుకుంది(upsc result 2021 topper list). ఇంతకీ ఈ సోదరీ'మణులు' ఎవరో తెలుసా..? వారే టీనా దాబి, రియా దాబి.
రియా సివిల్స్‌లో విజేతగా నిలిచిన విషయాన్ని టీనా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 'నా సోదరి రియా దాబి సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది,' అంటూ రాసుకొచ్చారు. ఈ ఇద్దరు కూడా దిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలోనే చదువుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా టీనా పేరు అప్పట్లో మార్మోగింది. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ ప్రభుత్వంలో ఆదాయపన్ను శాఖలో పనిచేస్తున్నారు.