బిహార్ పట్నా వరుస బాంబు పేలుళ్ల (Patna Rally Blast) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిలో 10మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది.
2013లో ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని (Narendra Modi Rally) ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో సెప్టెంబర్ 27న హుంకార్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఒక్కసారిగా ఆరు బాంబులు పేలాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గాయాలపాలయ్యారు.