తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​పై దాడికి 20 ఏళ్లు.. మృతులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

Parliament Attack 2001: 2001 పార్లమెంట్​​పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. అమరులను స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ట్వీట్ చేశారు.

parliament attack
పార్లమెంట్ దాడి

By

Published : Dec 13, 2021, 10:23 AM IST

Parliament Attack 2001: భారత పార్లమెంట్​పై జరిగిన ఉగ్రదాడికి 20 ఏళ్లు అయిన నేపథ్యంలో అప్పటి ఘటనలో మరణించిన భద్రతా సిబ్బందిని స్మరించుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. వారు చేసిన త్యాగానికి దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని అన్నారు. ఆ ఘటనలో మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Modi tweet Parliament attack

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పార్లమెంట్ దాడి ఘటనపై ట్వీట్ చేశారు. పార్లమెంట్​ దాడిని నిలువరించేందుకు ప్రయత్నించి మరణించిన సిబ్బందికి నివాళులు అర్పించారు. వీరి త్యాగం దేశ పౌరులకు ప్రేరణ అందిస్తూనే ఉంటుందని అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం భద్రతా సిబ్బందిని స్మరించుకుంటూ ట్వీట్లు చేశారు.

Parliament Attack mastermind

లష్కరే తొయిబా(ఎల్​ఈటీ) ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. ఇందులో ఓ పౌరుడు, భద్రతా సిబ్బంది సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పార్లమెంట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు.

ఇదీ చదవండి:రాజ్​పుత్​ల సంస్థానానికి మహారాజుగా ఆర్మీ అధికారి

ABOUT THE AUTHOR

...view details