తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Omicron Cases in India: దేశంలో 200 దాటిన ఒమిక్రాన్​ కేసులు - ఒమిక్రాన్​ వేరియంట్

Omicron Cases in India: దేశంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 200 దాటింది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్​ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది.

omicron cases
దేశంలో 200 దాటిన ఒమిక్రాన్​ కేసులు

By

Published : Dec 21, 2021, 12:02 PM IST

Omicron Cases in India: యావత్‌ ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలకు పాకగా.. మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 200 దారినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. ఒడిశాలో కూడా రెండు ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 202గా ఉంది. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటివరకు 77 మంది డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొంది.

తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌.. దాదాపు 100 దేశాలకు పైగా పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ఉద్ధృతి విపరీతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు బ్రిటన్‌లో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ దాదాపు 40వేల కొత్త వేరియంట్ కేసులు నమోదవ్వగా.. 12 మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే అక్కడ కొత్త వేరియంట్‌ కేసులు 73శాతానికి పెరిగాయి. అంతేగాక, ఈ వేరియంట్ కారణంగా టెక్సాస్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని కొన్ని దేశాలు లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఇదీ చూడండి :బూస్టర్‌ డోసుగా ముక్కుద్వారా తీసుకునే టీకా..!

ABOUT THE AUTHOR

...view details