బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. బాంబులు కలకలం రేపాయి. బీర్భూమ్ జిల్లా, నానూర్లోని ఓ కమ్యూనిటీ హాల్లో.. శుక్రవారం 200 నాటు బాంబులు బయటపడ్డాయి. బాంబులతో పాటు వాటి తయారీకి అవసరమైన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అనంతరం.. సీఐడీ బాంబ్ స్క్వాడ్ బృందం.. ఊరి చివర్లోని బహిరంగ ప్రదేశంలో ఆ బాంబులను నిర్వీర్యం చేసింది.