తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రెండు డోసులు తీసుకున్నా.. వారిలో యాంటీబాడీలు సున్నా'

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా.. చాలామందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందటం లేదని ఒడిశాలోని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ లైఫ్​ సైన్సెస్​.. తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి కాలేదని తేలింది. జన్యుపరమైన వ్యత్యాసాలే కారణమని అభిప్రాయపడింది.

antibodies
యాంటీబాడీలు

By

Published : Sep 12, 2021, 9:15 PM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. అందరికి యాంటీబాడీలు అభివృద్ధి చెందడం లేదని ఒడిశాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌ వెల్లడించింది. ఒడిశాలో టీకా రెండు డోసులు తీసుకున్న 20 శాతం మందిలో యాంటీబాడీలు పూర్తిస్థాయిలో అభివృద్ధి కాలేదని తెలిపింది. జన్యుపరమైన వ్యత్యాసాలే కారణమని అభిప్రాయపడింది.

బూస్టర్ డోస్ అవసరం..

రెండు టీకాలు వేసుకున్నవారికి 60 వేల నుంచి లక్షలోపు యాంటీబాడీలు ఉండాలన్న వైద్య నిపుణులు.. ఈ 20 శాతం మందిలో 50 వేల కంటే తక్కువగానే ఉన్నట్లు వివరించారు. వీరికి బూస్టర్‌ డోస్ అవసరమని సూచించారు.

వ్యాక్సిన్‌ తీసుకోనివారు, 18 ఏళ్ల పిల్లలతోపాటు ఈ 20 శాతం మంది కూడా రానున్న కొవిడ్‌ మూడో దశ సమయంలో వైరస్‌ బారిన పడే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:కేంద్రం కొత్త రూల్స్​- కొవిడ్​ మరణంగా ఎప్పుడు పరిగణిస్తారంటే?

ABOUT THE AUTHOR

...view details