తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండేళ్ల చిన్నారి గొప్ప మనసు.. క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానం..

క్యాన్సర్​ రోగుల కోసం మంగళూరుకు చెందిన దాదాపు రెండున్నరేళ్ల వయసున్న చిన్నారి తన జుట్టును దానం చేసింది. చిన్నారి చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆ చిన్నారి కథ ఓ సారి చదివేయండి.

2 year old girl donated her hair for cancer patients
2 year old girl donated her hair

By

Published : Oct 23, 2022, 8:24 AM IST

క్యాన్సర్​ రోగులకు ఓ వైపు కీమోథరపీ పీడిస్తే.. ఆ ట్రీట్​మెంట్​ వల్ల రాలుతున్న జుట్టు చూసి వారు మరింత కుంగిపోతారు. వారిలో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు కొందరు తమ జుట్టును దానం చేస్తారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ 2 ఏళ్ల నాలుగు నెలల వయసున్న ఓ చిన్నారి తన జుట్టును.. క్యాన్సర్ పేషెంట్స్​కు డొనేట్​ చేసి శభాష్ అనిపించుకుంది.

.
మంగళూరు మరోలీకి చెందిన భరత్​, సుమలతల కుమార్తె ఆద్యా కులాల్. ఆ చిన్నారి​ తన జుట్టును క్యాన్సర్​ బాధితులకు దానం ఇచ్చింది. ఈ విషయాన్ని మంగళూరు సౌత్​ ఎమ్మెల్యే వేదవ్యాస కామత్​ తన ఫేస్​బుక్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. చిన్నారిపై ఆయన ప్రశంసలు కురిపించారు.

'ఆద్యా కులాల్ అనే చిన్నారి మనోధైర్యాన్ని చూసి నాకు సంతోషం కలిగింది. ఇంత చిన్న వయసులోనే ఆమె తన జుట్టును క్యాన్సర్ పేషెంట్లకు దానం చేసింది. సమాజంలోని ఎందరికో ఆ చిన్నారి స్ఫూర్తిగా నిలిచింది. పాప తల్లిదండ్రులు భరత్​, సుమలత తమ కూతురిని సరైన మార్గంలో పెంచుతున్నారు. పెద్దయ్యాక.. చిన్నారి ఈ విషయం తెలుసుకుని ఎంతో సంతోషిస్తుంది'

ABOUT THE AUTHOR

...view details