Two Years Old Boy Died: అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి రెండేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. మృతి చెందిన చిన్నారిని కూరగాయల వ్యాపారి కుమారుడు దివాన్ష్ రెడ్డిగా గుర్తించారు.
ఇదీ జరిగింది..

దివాన్ష్ అమ్మమ్మ కొద్ది రోజులుగా నగరంలో అద్దె ఇంటి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే నీలాద్రి ఇన్వెస్ట్‌మెంట్ లేఅవుట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దె ఇల్లు ఉన్నట్లు తెలుసుకుంది. శుక్రవారం సాయంత్రం మనుమడితో కలిసి ఇంటిని చూసేందుకు అక్కడికి వెళ్లింది. అమ్మమ్మ ఐదో అంతస్తులో ఉన్న ఇంటిని పరిశీలిస్తుండగా.. బాల్కనీలో ఆడుకుంటున్న చిన్నారి జారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: