తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2 Women Kill 5 Relatives In 20 Days : ఆస్తి కోసం కుటుంబంపై పగ.. 20 రోజుల్లో ఐదుగురి హత్య.. పక్కాగా స్కెచ్​ వేసి మరీ..

2 Women Kill 5 Relatives In 20 Days : 20 రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని హత్య చేశారు ఇద్దరు మహిళలు. పక్కాగా ప్లాన్ చేసి మరీ అంతంమొందించారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది.

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:22 AM IST

Updated : Oct 19, 2023, 9:04 AM IST

Five deaths in family in 20 days
Five deaths in family in 20 days

2 Women Kill 5 Relatives In 20 Days :ఓ కుటుంబంపై పగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా అయిదుగురిని హతమార్చారు ఇద్దరు మహిళలు. ఈ వరుస మరణాలు అనుమానాస్పదంగా ఉండటం వల్ల లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకుల గుట్టు రట్టు చేశారు. ఓ మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలున్నాయి. మరో మహిళను అదే కుటుంబం వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఎలాగైనా ఆ కుటుంబాన్ని అంతమొందించాలని ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. దాన్ని పక్కాగా అమలుచేసి 20 రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా అయిదుగురి ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగింది.

ఇదీ కథ
గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన అత్తమామలు, భర్త వ్యవహార శైలి నచ్చలేదు. ఈమెతో పాటు రోసా అనే మరో మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉండటం వల్ల ఇద్దరూ చేతులు కలిపారు. ఆ కుటుంబాన్ని అంతమొందించాలని పన్నాగం పన్నారు. ఇందుకోసం రంగు, వాసన, రుచి లేని ఓ నాటుమందును సేకరించారు. సెప్టెంబర్​ 20న శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో దాన్ని కలిపారు. ఆ ఆహారాన్ని తిన్న తర్వాత వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు, ఆపైన గుండెనొప్పి వచ్చాయి. దీంతో వారిని నాగ్‌పుర్‌ ఆసుపత్రిలో చేర్పించగా.. సెప్టెంబరు 26న శంకర్‌, మరుసటిరోజు అతని భార్య విజయ చనిపోయింది.

అయితే, ఈ ఘటనను మరువకముందే శంకర్‌ దంపతుల కుమార్తెలు ఆనంద, కోమల్‌ కుమారుడు రోషన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బంధువులు ఆసుపత్రికి తరలించగా అక్టోబరు 8న కోమల్‌ చనిపోగా.. 14న ఆనంద, మరుసటిరోజు రోషన్‌ మరణించారు. ఈ అనుమానాస్పద మరణాల్లో అందరిలోనూ తీవ్రమైన వెన్నునొప్పి, తలపోటు, పెదవులు నల్లగా మారడం, అవయవాల జలదరింపు, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలను వైద్యులు గుర్తించారు. వారంతా విషప్రభావానికి గురై ఉంటారని పోలీసులకు తెలియజేశారు.

దీంతో అనుమానస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తొలుత మృతుడు రోషన్‌ భార్య సంఘమిత్రపై నిఘా ఉంచారు పోలీసులు. మరో నిందితురాలు రోసా చనిపోయిన విజయకు మరదలి వరస అవుతుంది. అక్కడే సమీపంలోని ఓ ఇంట్లో ఈమె నివసిస్తోంది. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంపై ఆమెకు విభేదాలున్నాయి. దీంతో సంఘమిత్రతో చేతులు కలిపి వారిని చంపేందుకు ప్లాన్ వేశారు. వీరిద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో ఏదైనా విషం దొరుకుతుందేమోనని వెదికారు. ఆ తర్వాత రోసా ఓ ప్రాంతానికి వెళ్లి అంతుచిక్కని పాషాణం తీసుకొచ్చింది.

ఈ కేసులో మరో దారుణం ఏమిటంటే.. శంకర్‌, విజయ దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ విషం కలిపిన నీటిని రోసా వారికి తాగించింది. అందులో ఆయుర్వేద గుణాలున్నాయని చెప్పడం వల్ల డ్రైవరు కూడా ఆ నీటిని కొంత తాగినట్లు సమాచారం. నిందితులు సంఘమిత్ర, రోసాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Navy Officer Fraud : ముగ్గురిని హత్య చేసిన మాజీ నేవీ ఆఫీసర్​.. తప్పించుకునేందుకు పక్కా స్కెచ్.. 20 ఏళ్ల తర్వాత..

Colombia Serial Killer Dead : వీధివ్యాపారిగా నటిస్తూ 190 మంది చిన్నారుల హత్య.. ఆస్పత్రిలో సీరియల్ కిల్లర్​ మృతి

Last Updated : Oct 19, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details