తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాకు గుడ్​బై.. కాంగ్రెస్​ గూటికి త్రిపుర ఎమ్మెల్యేలు - పార్టీని వీడిన త్రిపుర భాజపా ఎమ్మెల్యేలు

Tripura BJP MLA Resign: పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు త్రిపుర భాజపా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీతో సమావేశం అయిన ఇరువురు హస్తం పార్టీలో చేరినట్లు తెలిపారు.

2 Tripura MLAs quit BJP, joined in Congress
భాజపాకు గుడ్​బై చెప్పి.. కాంగ్రెస్​లో చేరిన త్రిపుర ఎమ్మెల్యేలు

By

Published : Feb 8, 2022, 11:20 AM IST

Tripura BJP MLA Resign: త్రిపురలో భాజపా పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు సోమవారం రాజీనామా చేసిన సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ సాహా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీని ఇవాళ ఉదయం ఆయన నివాసంలో కలిసిన ఇరువురు నేతలు.. భేటీ అనంతరం హస్తంపార్టీలో చేరారు.

రాబోయే రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్‌లో చేరిన అనంతరం సుదీప్ రాయ్ తెలిపారు. సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో నిరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. భాజపాలోని ప్రతి ఒక్కరు భ్రమల్లో ఉన్నారన్న ఆయన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటే త్రిపురలోనూ ఎన్నికలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ప్రజల అంచనాలకు అనుగుణంగా పాలన అందించడంలో భాజపా విఫలమైందని ఆశిష్​ విమర్శించారు. భాజపా ప్రభుత్వ హయాంలో త్రిపురలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని ఆరోపించారు.

ఇదీ చూడండి:టికెట్ల వేటలో నేతల వలసలు- వేడెక్కిన పంజాబ్‌ రాజకీయాలు!

ABOUT THE AUTHOR

...view details