Kerala Vishu Bumper lottery: అదృష్టం ఎప్పుడు ఎలా తలపుతడుతుందో తెలియదు అంటారు. వీరి విషయంలోనూ సరిగ్గా ఇలానే జరిగింది. తమిళనాడు కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్‌కు కేరళలో జాక్‌పాట్ తగిలింది. ఒకే కుటుంబానికి చెందిన వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును తీసుకొచ్చేందుకు తిరువనంతపురం ఎయిర్‌పోర్టు వెళ్లారు. అప్పుడే కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఓ ఏజెంట్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా వీరు కొనుగోలు చేసిన టికెట్‌కే రూ.10కోట్ల లాటరీ తగిలింది.
తమిళనాడు వాసులకు కేరళలో జాక్‌పాట్.. రూ.10కోట్ల లాటరీ.. - lottery
Kerala Lottery: తమిళనాడుకు చెందిన ఇద్దరికి కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువుకు తీసుకొచ్చేందుకు తిరవనంతపురం ఎయిర్‌పోర్టు వెళ్లిన వారు ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అదృష్టవశాత్తు లక్కీ డ్రాలో ఆ టికెట్ నంబరే వచ్చింది.
తమిళనాడు వాసులకు కేరళలో జాక్‌పాట్.. రూ.10కోట్ల లాటరీ..
మే 15న ఈ లాటరీ డ్రా తీశారు. ప్రదీప్, రమేశ్ రూ.10కోట్లు గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్‌కు వెళ్లి టికెట్‌తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించారు. రూ.10 కోట్లు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:కూతురి కోసం 'కులం లేని ధ్రువపత్రం'... తల్లిదండ్రుల ఆదర్శం..