Teachers locked students: ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లా బెహ్జంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న 24 మంది బాలికలను ఇద్దరు టీచర్లు స్కూల్ భవనంపై బంధించారు. వారు బయటకు రాకుండా తాళం వేశారు. తమ బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలని జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. బాలికలు పాఠశాల సమయం పూర్తయినా హాస్టల్కు రాకపోడవం వల్ల వార్డెన్ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన రంగంలోకి దిగి పాఠశాల వద్దకు చేరుకున్నారు. కొన్ని గంటల తర్వాత బాలికలను స్కూల్ నుంచి హాస్టల్కు తీసుకెళ్లారు.
టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం - Behjam news
Teachers lockup girl students: ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు టీచర్లు నిర్వాకం చేశారు. తమ బదిలీ ఆదేశాలను రద్దు చేయాలని 24మంది బాలికలను పాఠశాల భవనంపై బంధించి తాళం వేశారు. జిల్లా అధికారులు రంగంలోకి దిగి కొన్ని గంటల తర్వాత.. వారందరినీ బయటకు తీసుకొచ్చారు. అనంతరం టీచర్లపై కేసు నమోదు చేశారు.
![టీచర్ల నిర్వాకం.. విద్యార్థినులను బంధించి పాఠశాలకు తాళం Teachers lockup girl students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15093464-591-15093464-1650697916107.jpg)
Kasturba Gandhi Balika Vidyalaya: తమ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రద్దు చేయాలని అధికారులను ఒత్తిడి చేసేందుకే మనోరమ విశ్రా, గోల్డి కతియార్ అనే టీటర్లు ఇలా చేశారని బాలికల విద్య జిల్లా కో-ఆర్డినేటర్ లక్ష్మీకాంత్ పాండే తెలిపారు. ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. టీచర్లు కావాలనే ఇలా చేశారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:హనుమాన్ చాలీసా సవాల్.. నవనీత్ ఇంటివద్ద 'శినసేన' ఆందోళన