తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కడుపులో 2 కిలోల కొకైన్- ఇద్దరు అరెస్ట్​ - narcotic act 1985

కడుపులో మాదకద్రవ్యాలను పెట్టుకుని, అక్రమంగా సరఫరా చేస్తున్న ఇద్దరు టాంజానియా జాతీయులను ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శస్త్ర చికిత్స అనంతరం సుమారు 2కిలోల కొకైన్​ను వీరి కడుపు నుంచి బయటకు తీశారు వైద్యులు.

cocaine
కొకైన్

By

Published : Apr 30, 2021, 10:20 AM IST

మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లో టాంజానియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 2.225 కిలోల కొకైన్‌ పట్టుబడింది. దీని విలువ 13.35 కోట్ల రూపాయలు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తెలిపింది.

టాంజానియా జాతీయులైన మాంజీ కార్లోస్ ఆడమ్, రషీద్ పాల్ సయులా అనే ఇద్దరు వ్యక్తులు శరీరం లోపల డ్రగ్స్​ పెట్టుకొని వచ్చారని అధికారులు తెలిపారు. వీరు దార్-ఎ-సలాం నుంచి అడ్డీస్ అబాబా మీదుగా ఏప్రిల్​ 22న ముంబయికి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా.. గత గురువారం తనిఖీలు నిర్వహించారు డీఆర్​ఐ అధికారులు.

మేజిస్ట్రేట్ అనుమతితో జేజే ఆసుపత్రిలో వీరికి శస్త్ర చికిత్స నిర్వహించి ఒకరి కడుపులోంచి 97, మరొకరి నుంచి 54 క్యాప్సూల్స్​ను బయటకు తీశారు వైద్యులు. ఈ క్యాప్సూల్స్ నుంచి.. 1415 గ్రా., 810 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details