తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 2 లక్షల 73 వేల కేసులు- 1,619 మరణాలు - కరోనా కేసులు రికార్డు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రెండు లక్షల 73 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఏకంగా 1,619 మంది మరణించారు.

corona cases
కొవిడ్ కేసులు

By

Published : Apr 19, 2021, 9:31 AM IST

Updated : Apr 19, 2021, 9:47 AM IST

దేశంలో కరోనా ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో రెండు లక్షల 73 వేల 810 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒకరోజులో ఇదే అత్యధికం.

మరోవైపు వైరస్ కారణంగా 1,619 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజులో సంభవించిన మరణాలు కూడా ఇవే అధికం.

  • మొత్తం కేసులు: 1,50,61,919‬
  • మొత్తం మరణాలు: 1,78,769
  • కోలుకున్నవారు: 1,29,53,821
  • యాక్టివ్​ కేసులు: 19,29,329

ఆదివారం 12,30,007 మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు అందించిన డోసుల సంఖ్య 12,38,52,566కు చేరింది.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాలకు వెళ్తే.. ఈ ఆంక్షలు పాటించాల్సిందే!

Last Updated : Apr 19, 2021, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details