తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూడ్స్​ రైలు ఢీకొని.. రెండు గజరాజులు మృతి - ఒడిశాలో ఏనుగుల మృతి వార్త

ఒడిశాలో రైలు ట్రాకు దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్​ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో ఏనుగులు అక్కడికక్కడే మరణించాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

2 Elephants Killed After Being Hit By Train
గూడ్స్​ రైలు ఢీకొట్టి.. రెండు ఏనుగులు మృతి

By

Published : Feb 4, 2021, 7:09 PM IST

ఒడిశా సుందర్​గఢ్​ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో రెండు ఏనుగులు మృతి చెందాయి. బిర్సా ప్రాంతంలోని మహిపాని వద్ద బుధవారం రాత్రి ట్రాక్ దాటుతున్న రెండు ఏనుగులను గూడ్స్​ రైలు ఢీకొట్టగా.. ఈ ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు రైలు చక్రాల కింద ఇరుక్కుపోవడం వల్ల.. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పట్టాలు పక్కనే పడిఉన్న ఏనుగు కళేబరం
మృతి చెందిన మరో ఏనుగు చుట్టూ గుమిగూడిన స్థానికులు

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. ఏనుగుల కళేబరాలను తొలగించి ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

ABOUT THE AUTHOR

...view details