దేశంలో కరోనా మహమ్మారి వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటోంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ రోజురోజుకూ మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం ఒక్కరోజే 4,529మంది వైరస్ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మంగళవారం నాటి అత్యధిక మరణాల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
కొవిడ్ మారణహోమం- ఒక్కరోజే 4,529మంది మృతి
కరోనా మహమ్మారి దేశంలో మరణమృదంగం మోగిస్తోంది. వైరస్ ధాటికి మరో 4,529మంది బలయ్యారు. ఇప్పటివరకు రోజువారీ కరోనా మరణాల్లో ఇవే అధికం కావడం గమనార్హం. కొత్తగా 2.67 లక్షల కేసులు నమోదయ్యాయి.
భారత్ కరోనా
కాగా, కొత్తగా 2,67,334 లక్షల మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 3,89,851మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,54,96,330
- మరణాలు: 2,83,248
- కోలుకున్నవారు: 2,19,86,363
- యాక్టివ్ కేసులు: 32,26,719
మరోవైపు మంగళవారం 20,08,296 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 32 కోట్లు దాటిందని వెల్లడించింది.
Last Updated : May 19, 2021, 10:50 AM IST