రాజస్థాన్ అజ్మేర్లోని జవహర్లాల్ నెహ్రూ ఆస్పత్రిలో ఇద్దరు కొవిడ్ రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.
అర్ధరాత్రి సుమారు 12 గంటలకు వార్డులోకి ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. ఈ విషయంపై సిబ్బందిని అప్రమత్తం చేయగా 10 నిమిషాల తర్వాత ఆక్సిజన్‌ను పునరుద్ధరించారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు పేర్కొన్నారు.