నేరస్థులను పసిగట్టడానికి ఉపయోగపడే 'ఫోరెన్సిక్ డీఎన్ఏ ప్రొఫైల్ సెర్చ్ టూల్'ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ప్రారంభించారు. ముఖ్యంగా.. తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన పిల్లలను డీఎన్ఏ ఆధారంగా పసిగట్టి తమ తల్లిదండ్రుల చెంతకు చేర్చగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది.
డీఎన్‌ను సాంకేతికతతో మిళితం చేసే టెక్నాలజీని విదేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. మనదేశంలో ఈ సాంకేతికత వాడుతున్న మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. అంతరాష్ట్ర నేరస్థులను కనిపెట్టడం, తరచూ నేరాలకు పాల్పడేవారిని పసిగట్టడం, గుర్తుతెలియని మృతదేహాలను, అస్థిపంజరాలను గుర్తించడం వంటి పనులు ఈ సాంకేతికతతో సులభమవుతాయని అధికారులు తెలిపారు.