తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రూట్ బాక్సులపై డౌట్.. ఓపెన్ చేస్తే రూ. 1,476 కోట్ల డ్రగ్స్ - డ్రగ్స్ స్మగ్లింగ్

Drugs Seized In Mumbai : మహారాష్ట్ర నవీ ముంబయిలో పెద్ద ఎత్తున డ్రగ్స్​ను పట్టుకున్నారు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

drugs seized in mumbai
drugs seized in mumbai

By

Published : Oct 2, 2022, 11:17 AM IST

Updated : Oct 2, 2022, 5:34 PM IST

Drugs Seized In Mumbai : మహారాష్ట్ర నవీ ముంబయిలో భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు. 198 కిలోల క్రిస్టల్ మెథాంఫేటమిన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని చెప్పారు.

పండ్ల డబ్బాలో దాచిపెట్టిన డ్రగ్స్

ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. గత 12 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. సెప్టెంబర్​ 12న తనిఖీలు చేస్తున్న సమయంలో పండ్ల ట్రక్కులో డ్రగ్స్​ను గుర్తించారు. పండ్ల డబ్బాల్లో డ్రగ్స్​ను దాచిపెట్టి కొత్త విధానంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని.. దిగుమతిదారుడిని పట్టుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అక్రమ రవాణా సూత్రధారుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

అధికారులు పట్టుకున్న డ్రగ్స్

రూ.34 కోట్ల డ్రగ్స్..
మరోవైపు, ముంబయి ఎయిర్​పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. విదేశీ ప్రయాణికుడి నుంచి 5 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు ముంబయి కస్టమ్స్అధికారులు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.34 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 2, 2022, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details