తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో పరువు హత్య.. చెల్లి లవర్​ను చంపిన అన్న.. ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా.. - బిహార్​ పరువు హత్య

తన సోదరితో ఆమె ప్రియుడు సన్నిహితంగా ఉండడం చూసి సోదరుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే అతడిని చంపేందుకు ప్లాన్​ చేశాడు. అందుకు తన సోదరి ఫోన్​నే ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా పెట్టాడు. మిగతా ముక్కలను నదిలో విసిరేశాడు. బిహార్​లో జరిగిందీ దారుణం.

19-year-old kills sister's beau, chops body and feed to stray dogs
19-year-old kills sister's beau, chops body and feed to stray dogs

By

Published : Dec 26, 2022, 12:57 PM IST

Updated : Dec 26, 2022, 8:04 PM IST

బిహార్​లోని నలంద జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఓ వ్యక్తి తన సోదరి ప్రియుడిని చంపేశాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టాడు. మిగతా ముక్కలను నదిలో విసిరేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బిట్టు కుమార్​.. డిసెంబరు 16వ తేదీన బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో డిసెంబరు 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణలో భాగంగా నిందితుడు రాహుల్​పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అతడి దగ్గర ఉన్న బాధితుడి మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరపగా.. రాహుల్​ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన సోదరితో బిట్టు సన్నిహితంగా ఉండడం చూశానని అది తట్టుకోలేకపోయానని రాహుల్​ పోలీసులకు తెలిపాడు. కోపంతో బిట్టును చంపేందుకు ప్లాన్​ చేశానని చెప్పాడు. డిసెంబరు 16న తన సోదరి మొబైల్ నుంచి ఫోన్​ చేసి బిట్టును నిర్మానుష్య ప్రదేశానికి పిలిచానని, అనంతరం అతడిని చంపానని తెలిపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా పెట్టానని.. మిగతావాటిని నదిలోకి విసిరేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు.

ఇనుప రాడ్లను దొంగలించేందుకు యత్నించి..
ఉత్తరాఖండ్​లో రాంపుర్​ జిల్లాలో పులి దాడిలో ఓ యువకుడు మరణించాడు. మృతుడిని నఫీస్​గా పోలీసులు గుర్తించారు. దారుణ స్థితిలో బాధితుడి మృతదేహం లభ్యమైందని.. శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని కార్బెట్​ నేషనల్​ పార్క్​ పక్కనే ఉన్న మోహన్​ ప్రాంతానికి నఫీస్​ అనే యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ముగ్గురూ కలిసి అక్కడ మద్యం సేవించినట్లు సమాచారం. అనంతరం అక్కడ పడి ఉన్న స్టీల్​ రాడ్లను దొంగలించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఓ పులి.. అక్కడి వచ్చి నఫీస్​ను ఈడ్చుకుని అడవిలోకి తీసుకెళ్లింది. వెంటనే మిగతా ఇద్దరు యువకులు పారిపోయి అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నఫీస్​ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం రక్తపుమడుగులో నఫీస్ మృతదేహం లభ్యమైంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి శవపరీక్షల నిమిత్తం తరిలించారు. అయితే ఇనుప రాడ్లను దొంగలించేందుకు ప్రయత్నించిన మిగతా ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పులిని పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు.

ముఖం నల్లగా ఉందని ట్రిపుల్​ తలాక్​ చెప్పిన భర్త..
ముఖం నల్లగా ఉందని ఓ మహిళకు ఆమె భర్త ట్రిపుల్​ తలాక్​ చెప్పాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
జిల్లాలోని బన్నాదేవి ప్రాంతానికి చెందిన బాధితురాలికి సారాయి రామన్​ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితమే వివాహమైంది. వధూవరుల తండ్రులు మంచి స్నేహితులు. కానీ పెళ్లి తర్వాత భార్య ముఖం నల్లగా ఉందని రామన్ పూర్తిగా​ దూరం పెట్టాడు. అలా పెళ్లైన ముడేళ్ల తర్వాత ట్రిపుల్​ తలాక్​ చెప్పి ఇంట్లో నుంచి పంపించేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ తన భర్తపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు తెలిపింది.

Last Updated : Dec 26, 2022, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details