తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆమె కుంచెకు గిన్నిస్​ రికార్డు దాసోహం.. - దుబాయ్​లో గ్లోబల్​ విలేజ్​ సీజన్​ 25తో రోశ్నకు గుర్తింపు

కేరళలో ఓ యువతి గీసిన కార్టూన్ల ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. కేవలం 20 రోజుల్లో 400మీటర్లకు పైగా ఆమె వేసిన బొమ్మల సమూహానికి గిన్నిస్​ బుక్​లో స్థానం దొరికింది. ఇప్పటివరకు 25కు పైగా అంతర్జాతీయ పతకాలను అందుకున్నారు. ఆమే కోజి​కోడ్​కు చెందిన రోశ్నా.

Kerala girl sets Guinness record for world's longest cartoon
రోశ్నా కార్టూన్లు

By

Published : Aug 7, 2021, 8:16 PM IST

ఆమె కుంచెకు గిన్నిస్​ రికార్డు దాసోహం..

ఆమెకు నిశిత పరిశీలన ఎక్కువ. అలానే దేశంపై అభిమానం. సంస్కృతిపై ప్రేమ కూడా. తన తండ్రి నుంచి వారసత్వంగా అబ్బిన కళతో దేశ ఔన్నత్యాన్ని చాటాలనుకుంది కేరళ కోజికోడ్​కు చెందిన రోశ్నా. అనుకున్నదే తడవుగా ఆ యువతి కుంచె పట్టి బొమ్మలు గీయడం ప్రారంభించింది. అలా ఆమె గీసిన బొమ్మల సమాహారానికి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​ వరించింది.

400 మీటర్ల కార్టూన్ల సమాహరం
తమాషా కార్టూన్లు గీస్తున్న రోశ్నా

ఇప్పటికే 25 అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్న ఈ 19 ఏళ్ల యువతికి దుబాయ్​లో జరిగిన గ్లోబల్​ విలేజ్​ సీజన్​-25 కార్యక్రమంతో మంచి గుర్తింపు లభించింది. ఈ పోటీల్లో ప్రపంచంలోని అన్నీ దేశాలకు చెందిన వారు పాల్గొని వారి సంస్కృతి, సంప్రదాయలను ప్రతిభింబించేలా కార్టూన్లు గీసి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే భారతదేశ సంప్రదాయాలను కొట్టొచ్చినట్లు కనిపించేలా రోశ్నా వేసిన బొమ్మలు అవార్డును గెలుచుకున్నాయి.

రోశ్నా వేసిన కార్టూన్లు

రోశ్నా తండ్రి దిలీప్​ ప్రముఖ కార్టూనిస్ట్​. చిన్ననాటి నుంచి నాన్న వేసి కార్టూన్లను చూస్తూ పెరిగింది. దీంతో ఆమె కూడా ఆ కళపై పట్టు సాధించాలని అనుకుంది. అలా తన ప్రస్థానాన్ని సాగించింది. 2015లో మొదటిసారిగా కార్టూన్లు గీసి గిన్నిస్​ రికార్డ్​ జ్యూరీకి పంపించింది. కానీ విఫలమైంది. ఆ తరువాత రెండో ప్రయత్నంలో విజయం సాధించింది.

ఇదీ చూడండి:దొంగతనానికి పోయి... ఏటీఎంలో ఇరుక్కుపోయాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details