తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2021, 4:27 PM IST

ETV Bharat / bharat

'ఎర్రకోట ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు'

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసకు సంబంధించి 19 మందిని అరెస్టు చేశామని, మొత్తంగా 25 కేసులు నమోదయ్యాయని దిల్లీ హైకోర్టుకు తెలిపింది కేంద్రం. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది.

19 people arrested and 25 FIRs lodged in Republic Day violence
'ఎర్రకోట ఘటనలో 19 మంది అరెస్టు, 25 కేసులు నమోదు'

జనవరి 26న దిల్లీ ఎర్రకోట వద్ద హింస కేసులో 19 మందిని అరెస్టు చేసినట్లు దిల్లీ హైకోర్టుకు తెలిపింది కేంద్రం. దీనికి సంబంధించి మొత్తంగా 25 కేసులు నమోదైనట్లు వివరించింది.

ఈ కేసులో 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని... అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ, ప్రభుత్వం తరఫు న్యాయవాది అజయ్ దిగ్​పాల్​ కోర్టుకు తెలిపారు. ఎర్రకోట రక్షణ కోసం పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మొహరించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించిన దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్ పటేల్, జస్టిస్​ జస్మీత్ సింగ్... ఈ ఘటనకు సంబంధించి ఇతర కోర్టుల్లో ఏమైనా కేసులు నమోదయ్యాయేమో తెలియచేయాలని కేంద్రాన్ని ఆదేశించారు. దిల్లీ వాసి ధనుంజయ్ జైన్​ వేసిన పిటిషన్​పై ఈ విధంగా విచారణ జరిపారు.

పిటిషన్​లో ఏముంది?

సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న అన్నదాతలను అక్కడి నుంచి పంపేయాలని పిటిషన్ ​దాఖలు చేశారు ధనుంజయ్. ఎర్రకోట ఘటనకు సంబంధించి సమర్థంగా విధులు నిర్వహించలేకపోయిన పోలీసులందరినీ సస్పెండ్​ చేయాలని, దిల్లీ పోలీస్ కమిషనర్​ను తొలగించాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఎర్రకోట ఘటనలో ప్రముఖ ​రైతు నేత అరెస్టు

ABOUT THE AUTHOR

...view details