తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటు కరోనా- ఇటు జికా.. కేరళ విలవిల - జికా వైరస్

కరోనా విజృంభణతో వణుకుతున్న కేరళలో జికా వైరస్‌ కేసులు కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. కొత్తగా 18, 531 మంది కొవిడ్ బారిన పడగా.. మరో ఇద్దరికి జికా వైరస్ సోకింది.

zika, corona
కరోనా, జికా

By

Published : Jul 24, 2021, 9:09 PM IST

కేరళలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 18,531 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కేరళలో జికా వైరస్​ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.

కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,54,064కు పెరిగింది. కొత్తగా 98 మంది వైరస్​కు బలవ్వగా.. మరణాల సంఖ్య 15,507కు చేరింది. పాజిటివిటీ రేటు 12 శాతం కంటే తక్కువగా నమోదైంది.

15, 507 మంది కొవిడ్​ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 30,99,469కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,38,124 యాక్టివ్​ కేసులున్నాయి.

జికా వ్యాప్తి....

కొత్తగా మరో రెండు జికా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 46కు పెరిగింది.

తిరువనంతపురంలోని కుమారపురంకు చెందిన 42 ఏళ్ల మహిళ, కొట్టరక్కరకు చెందిన 30 ఏళ్ల మహిళ జికా వైరస్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిరంగానే ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కేరళలో జికా విజృంభణ- కొత్తగా డెంగ్యూ కేసులు!

కేరళలో పెరుగుతున్న జికా కేసులు

ABOUT THE AUTHOR

...view details