తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగులు పడి 20 ఏనుగులు మృతి - పిడుగులు పడి 18 ఏనుగులు మృతి!

పిడుగుల వర్షం ధాటికి 20 ఏనుగులు మరణించాయి. అసోంలోని నాగావ్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

elephants killed
ఏనుగులు మృతి

By

Published : May 13, 2021, 6:41 PM IST

Updated : May 13, 2021, 8:46 PM IST

పిడుగులు పడి మరణించిన ఏనుగులు

అసోంలో పిడుగులు పడి 20 ఏనుగులు మరణించాయి. నాగావ్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి గురువారం తెలిపారు.

పిడుగులు పడి మరణించిన ఏనుగు
ఏనుగుల మృతదేహాలు

కాతియాటోలి రేంజ్​లోని కుందోలి అటవీ సంరక్షణ ప్రాంతంలోని ఓ కొండపై బుధవారం రాత్రి పిడుగుల వర్షం కురిసిందని అటవీ సంరక్షణ ముఖ్యాధికారి అమిత్​ సహాయ్​ చెప్పారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో తాము ఏనుగుల మృతదేహాలు తనిఖీ చేసేందుకు వెళ్లామని చెప్పారు.

"ఈ ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం మా బృందం ఇక్కడకు చేరుకోగలిగింది. మేము వెళ్లి చూసి చూసేసరికి.. బామునీ కొండ ప్రాంతంలో 20 ఏనుగుల మృతదేహాలు కనిపించాయి."

- అమిత్​ సహాయ్​, అటవీ సంరక్షణ ముఖ్యాధికారి

ఏనుగు మృతదేహం
ఏనుగు మృతదేహం

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పిడుగు పాటు కారణంగానే ఈ ఏనుగులు మరణించినట్లు తేలిందని అమిత్​ సహాయ్​ తెలిపారు. అయితే.. పోస్టు మార్టం అనంతరమే.. ఈ ఏనుగుల మృతికి కచ్చితమైన కారణాలు వెల్లడించగలమని చెప్పారు.

ఇదీ చూడండి:కరోనాను జయించిన 13 మంది కుటుంబ సభ్యులు

ఇదీ చూడండి:బిహార్​లో పిడుగుల వర్షం- 13 మంది మృతి

Last Updated : May 13, 2021, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details