మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో రెండు నెలల్లోనే దాదాపు 17వేల మంది 18 ఏళ్ల లోపు పిల్లలు కరోనా(corona virus) బారిన పడటం కలవరపెడుతోంది. ఏప్రిల్‌లో 7,760 మంది, మేలో 9,928 మందికి కలిపి మొత్తం 17,688 చిన్నారులకు వైరస్ సోకినట్లు జిల్లా సర్జన్ డా.సునీల్ పోఖ్రాణా వెల్లడించారు. ఈ గణాంకాలను జిల్లా కలెక్టర్ డా.రాజేంద్ర భోస్లే ధ్రువీకరించారు.
Covid: 2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్! - పిల్లల్లో కరోనా లక్షణాలు
మహారాష్ట్రలోని ఓ జిల్లాలో కేవలం రెండు నెలల్లోనే సుమారు 17వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో మూడో వేవ్‌లో వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందనే నిపుణుల అంచనాలు బలపడుతున్నాయని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు.
corona in children
మొత్తం పాజిటివ్ కేసుల్లో 18 ఏళ్ల లోపు వారే 8 నుంచి 10 శాతం ఉన్నారని సునీల్ తెలిపారు. కరోనా మూడో దశ(Third Wave)లో పిల్లలే అధికంగా ప్రభావితమవుతారని నిపుణులు హెచ్చరిస్తోన్న వేళ ఈ లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:22 ఏళ్లలో 16 వేల శవాలకు అంత్యక్రియలు