తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ రూ.170 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు - తమిళనాడులో అక్రమాస్తుల గుర్తింపు

తమిళనాడులో ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్ వద్ద రూ.170 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు ఆదాయపు పన్ను అధికారులు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బు దాచారనే సమాచారంతో ఈ దాడులు చేశారు.

170 crore unaccounted income detected in TN Government Contractor
ఎన్నికల వేళ రూ.170 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

By

Published : Mar 5, 2021, 12:49 PM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో రూ.170 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది ఆదాయపు పన్ను శాఖ. అదంతా ఆ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టర్ వెట్రికి చెందినవని తెలిపింది. ఏఎంఎంకే పార్టీ మధురై జిల్లా కార్యదర్శి మహేంద్రన్​కు ఆయన సోదరుడు.

ఎన్నికల్లో పంచడానికి పెద్దఎత్తున నగదు దాచిపెట్టారన్న నిఘావర్గాల సమాచారం మేరకు వెట్రి కంపెనీల్లో రెండు రోజులపాటు సోదాలు చేశారు అధికారులు. థియేటర్లు, నిర్మాణ సంస్థ, పెట్రోల్ బంక్ సహా 12 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

సోదాల్లో రూ.170కోట్ల మేర ఆస్తులను లెక్కల్లో చూపనివిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రూ.3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:అసోం కోసం 'ఛత్తీస్​గఢ్'​ ఫార్ములా- రంగంలోకి బఘేల్

ABOUT THE AUTHOR

...view details