తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మల విసర్జనకు వెళ్లిన అమ్మాయి శవమై.. - ఫతేపుర్​లో బాలిక హత్య

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేపుర్​లో దారుణం జరిగింది. మల విసర్జన కోసం తెల్లవారు జామున అడవికి వెళ్లిన 17 ఏళ్ల అమ్మాయి చివరకు శవమై కనిపించింది.

GIRL MURDER
మల విసర్జనకు వెళ్లిన అమ్మాయి చివరకు శవమై..!

By

Published : Jan 8, 2022, 10:42 PM IST

మలవిసర్జన కోసం అడవికి వెళ్లిన 17 ఏళ్ల అమ్మాయి చివరకు శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన లాలౌలీ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో అమ్మాయి గొంతు కోసి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ జరిగింది..

శనివారం తెల్లవారుజామున.. ఆ యువతి మల విసర్జనకు అడవికి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడం కారణంగా.. కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. చివరగా ఆమె మృతదేహాన్ని సమీప పొలాల్లో కనుగొన్నట్లు జఫర్‌గంజ్ సర్కిల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలిలో అమ్మాయి ఒంటిమీద బట్టలు దూరంగా పడున్నాయని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామని వివరించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

పార్లమెంట్​లో కరోనా కలకలం- 350 మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details