తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై గ్యాంగ్​ రేప్- ముఖంపై కొరికి, చంపేస్తానని బెదిరించి... - మైనర్​ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు

MINOR GIRL RAPE CASE: 17 ఏళ్ల గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడు.. ఆమె ముఖంపై పళ్లతో గట్టిగా కొరికాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

RAPE CASE
మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్

By

Published : Feb 8, 2022, 12:25 PM IST

MINOR GIRL RAPE CASE: మధ్యప్రదేశ్‌ రేవా జిల్లాలో 17 ఏళ్ల గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం..

బాధితురాలు తన చెల్లెలుతో కలిసి స్థానికంగా జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. ముగ్గురు నిందితులు ఆమెను అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు బాలిక ముఖాన్ని కొరికి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు. ఆమె వారి నుంచి తప్పించుకుని తన బంధువుల ఇంటికి చేరుకుని జరిగిన విషయం చెప్పింది.

"ఆ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాం. వారిలో ఇద్దరు మైనర్లు. బాధితురాలితో పాటు నిందితులు గిరిజన వర్గానికి చెందిన వారే. ఐపీసీ కింద పలు కేసులుతో పాటు పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశాం. బాలిక మెడికల్​ రిపోర్టు నేరాన్ని నిర్ధరించింది. ఈ ఘటన తర్వాత బాధితురాలి కుటుంబసభ్యులు ప్రధాన నిందితుడిని పెళ్లి చేసుకోవాలని కోరారు. అందుకు అతడు అంగీకరించపోవడం వల్ల సోమవారం ఫిర్యాదు చేశారు."

-శివశంకర్​ వర్మ, ఏసీపీ

ఇదీ చదవండి: భార్య, కూతురికి సేవ చేయలేక విసిగి.. గొంతు కోసి..

ABOUT THE AUTHOR

...view details