ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పుర్‌లో రెండు రోజుల కిందట సామూహిక అత్యాచారానికి గురైన బాలిక చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికంగా ఉన్న మౌదాహా ప్రాంతంలో చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి క్షీణించిందని అక్కడి ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాలని వేరే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించినట్లు పేర్కొన్నారు.
బాధితురాలి కుటుంబం.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు. అయితే.. తన కుమార్తెపై సోమవారం రాత్రి అయిదుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. భయపడి.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అన్నారు.